రామకృష్ణ,
సీపీఐ నేత.
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం. మేం అందరం కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తాం. అయితే, బీజేపీతో కలసి పోటీ చేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెబుతాం. పాచిపోయిన లడ్డూలు.. మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్ కల్యాణ్ చెప్పాలి.
మరోవైపు.. పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా జీవో 1 ఉంది. విజ్ఞత లేకుండా మరల జీవో ఇస్తామనడం పోలీసు రాజ్యం నడపాలనా? పోలీసు రాజ్యం నడపడానికి సీఎం అవసరమా?. పోలీసు రాజ్యం నడపాలంటే డీజీపీని సీఎం సీట్లో కూర్చోపెట్టాలి. కొత్త జీవో తెస్తే మేం ప్రత్యక్ష ఆందోళనకు సమాయుత్తం అవుతాం.
ఇళ్ల స్ధలాల అంశం కంటే ముందు అమరావతి రాజధాని ఉందా లేదా చెప్పాలి. రాజధాని విశాఖపట్నమా..? అమరావతా..? స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. సెంటు భూమి ఏం చేసుకోవాలి.. నీ బాత్ రూం అంత కూడా పేదవాడికి ఇవ్వరా..?. పేదవారిని భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు.
ఇందిరాగాంధీ హయాంలో 5 సెంట్లు ఇచ్చారు.. ఇప్పుడు సెంట్ భూమి ఏం చేసుకోవాలి. రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలి. ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇచ్చి.. ఒకొక్కరికి 5 లక్షలు ఇవ్వాలి.