తెలంగాణ లో మోడీ పర్యటనను నిరసిస్తూ..రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ ప్రేయాజాలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మోడీ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి కూడా సీపీఐ వ్యతిరేకిస్తూనే ఉంది.
ఏ నేపథ్యంలో రామగుండం లో మోడీ నిర్వహించబోయే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఈ క్రమంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమం లో రామగుండం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏఐటీయూసీ నేత సీతారామయ్య అరెస్ట్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. హైదరాబాద్ లో
రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ను హౌస్ అరెస్ట్ చేసారు.
వరంగల్ లో ఏఐవైఎఫ్ నేత వలీ ఉల్లాఖాద్రీ ను అరెస్ట్ చేశారు. హైదరాబాదులో కొనసాగుతున్న సీపీఐ దాని అనుబంధ సంఘాల నేతల అరెస్టులు.