విశేష ప్రేక్షకాదరణ పొందిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తిచేసుకుని 5వ సీజన్ లో కి అడుగుపెట్టింది. అయితే బిగ్ బాస్ షో పై సిపిఐ నేత నారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ప్రోగ్రాం ఓ బ్రోతల్ షో అంటూ మండిపడ్డారు. ఇది కూడా ఓ క్యాన్సర్ లాంటిదేనని నైతిక విలువలు
దెబ్బతీసేలా.. పిల్లల బుర్రలు పాడు చేసేలా ఉందన్నారు నారాయణ.
నేరాలు పెరగడానికి ఇలాంటి కార్యక్రమాలే
కారణమవుతున్నాయని అన్నారు. బయటికే ఇన్ని
బూతులు కనిపిస్తున్నాయని.. కనిపించకుండా ఇంకేం
జరుగుతోందో అని అన్నారు నారాయణ.