నారాయణ
సిపిఐ నేత
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని టీవీ5 న్యూస్ ఛానెల్ ఆఫీస్‌పై రాళ్ల దాడి జరిగింది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో సెక్యూరిటీ రూమ్ అద్దాలను ధ్వంసం చేసి పారిపోయారు. ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని భావిస్తుండగా.. పలువురు రాజకీయ నేతలు ఈ దాడిని ఖండిస్తున్నారు. ఇదే విషయమై సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో భాగం అయిన మీడియా పై దాడి చెయ్యటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటమే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్త సంస్థలు ఎంతో ముఖ్యమైనవి.. అలాంటి వార్తా సంస్థల నోరు కట్టేయటానికి చూస్తున్నారు.
ఇది అప్రజాస్వామ్యం అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ వారికి ఇష్టం లేని మీడియా ప్రతినిధులపై ఇష్టం వాచినట్టు తిట్టటంలాంటి పద్ధతి మొదలు పెట్టిన తరువాత కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఇలాంటి పనులకు పాల్పడటానికి రెడీ అవుతున్నారని నారాయణ విమర్శించారు.