నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
సేవ్ ఇండియా – మోడీ హటావో నినాదం పేరుతో 27న భారత్ బంద్ నిర్వహిస్తాం. పోర్టులను ప్రైవేటీకరిస్తే స్మగ్లింగ్ ఎక్కువై దేశ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థిక నేరస్తులను కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది. బిగ్ బాస్ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోంది.
బూతుల పంచాంగంతో తెలుగు రాష్ట్రాల మంత్రులు పోటాపోటీగా తిట్టుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్య. 27న జరగబోయే బంద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కూర్చోవాలి. ప్రభుత్వం చేసిన తప్పులు చెబితే తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ బురద చల్లడం దారుణం.