కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. ఎక్కడ చూసినా అవినీతి, కబ్జాలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నామా అని బాధపడే రోజులొచ్చాయని చురకలంటించారు.
తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు నారాయణ. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వందల మంది బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు.