హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సీపీఐ నారాయణ, బండారు దత్తాత్రేయతో సమావేశం కావడం రాజకీయమైన చర్చలకు దారితీస్తోంది.
అసలు బీజేపీకీ, కమ్యూనిస్టులకు పొత్తే కుదరదు. భావసారూప్యతలోనే కాదు ఈ రెండు పార్టీల నేతల మధ్య కూడా నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.
మాజీ రాజ్య సభ సభ్యుడు అజీజ్ పాషాతో కలిసి సీపీఐ నారాయణ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో వీరి భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది.
అయితే తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి.. సీపీఐ మద్దతుగా నిలుస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో వీరి భేటీపై రాజకీయపరంగా ఆసక్తి ఏర్పడింది.