సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
ఆన్లైన్ లో అప్పులు ఇస్తూ కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. ప్రజల అవసరాలను అడ్డం పెట్టుకుని అప్పుల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలకు కనిపించడం లేదా… గతంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇదే తరహా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటే సీపీఐ అటువంటి సంస్థలపై ప్రత్యక్ష పోరాటాలకు పిలుపునిచ్చి నిలువరించాం. ఒక వైపు ప్రభుత్వాలే ప్రజల నడ్డి విరిచేలా పన్నులు, ధరలు పెంచుతూ ఉంటే మరోవైపు ఆన్లైన్ లో అప్పులు ఇస్తున్న సంస్థలు ప్రజలను దారుణంగా మోసాగిస్తూ మానసిక హింసకు గురి చేస్తున్నారు. ఆన్ లైన్ లో అప్పులు ఇవ్వడం అధిక వడ్డీలు వసూలు చేయడం..కట్టలేని బాధితులపై రౌడీలు గుండాలతో బెదిరింపులకు దిగడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు.
ఈ తరహా ఆన్లైన్ అప్పులు చేసిన వారు వారు వేస్తున్న అధిక వడ్డీ లు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో ప్రముఖ న్యాయ వాది అప్పులు ఇచ్చిన ఆన్లైన్ సంస్థల వేధింపులు, తిట్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. ప్రభుత్వాలు కళ్ళు తెరచి ఆన్లైన్లో అప్పులు ఇస్తున్న సంస్థలు వారి కార్యకలపాలపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే ప్రభుత్వాలు స్పందించక పోతే బాధితులతో కలసి అప్పులు ఇస్తున్న అటువంటి ఆన్ లైన్ సంస్థలపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతాం.