సీపీఐ జాతీయ మహా సభలకు 12 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. 14 వ తేదీన నగరంలో ర్యాలీ నిర్వహించి, సింగ్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
16న తేదీన సభలో విదేశీ ప్రతినిధులు ప్రసంగిస్తారని ఆయన వివరించారు.18న నూతన జాతీయ కార్యవర్గం ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశం ఉన్న క్లిష్ట సమయాల్లో సీపీఐ సభలు జరుగుతున్నాయన్నారు.
దేశంలో బీజేపీ చేస్తున్న చర్యల వల్ల అసలు ర్యాజ్యాంగ ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. సీపీఐ ఒక్కటే బీజేపీ నీ ఓడిస్తామని చెప్పడం లేదు. అందుకే అందరిని కలుపుకొని బీజేపీ పై పోరాటం చేస్తామన్నారు.
కేసీఆర్ మొన్నటి వరకు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎవరు వ్యతిరేకంగా పోరాటం చేసిన సీపీఐ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు. దేశంలోని రాష్ట్రాల్లో బలమైన పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించారు.
వైసీపీ కేంద్రం ఏది చెబుతుంటే వైసీపీ అది చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా అణిచి వేస్తోందన్నారు. జగన్ బీజేపీతో ఉంటారో… ప్రజలతో ఉంటారో తేల్చుకోవాలన్నారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ అదానీ పైకి వచ్చారని విమర్శించారు.
వైసీపీ ఎంపీ భూములు ఎలా అక్రమించుకుంటున్నారో విజయసాయిరెడ్డి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఎలా భూములు దోచుకుంటున్నారో వైసీపీ నేతలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో మంచి ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకుంటానన్న జగన్…వైసీపీ నేతల భూ కబ్జాలపై సమాధానం చెప్పాలన్నారు.