ఎన్నికల తీరుతెన్నలు మారాయి… మీరు కూడా మారాలంటూ వామపక్షాలను విమర్శించే వారు ఎందరో. కానీ ఎంత చెప్పిన కమ్యూనిస్టులు మాత్రం మారరన్న అభిప్రాయం ఉంది. కానీ ఇందులో సీపీఐ నారాయణ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అవును ఒక్కోసారి ఆయన చేసిన పనులు, కామెంట్స్ చర్చనీయాంశం అవుతాయి. ఇది కూడా ఆ కోవకు చెందినదే.
స్వామీజీ ! మిమ్మల్ని కలిసి గెలిపించాలని కోరిన వారందరినీ గెలిపిస్తారంటగా… మా అభ్యర్థిని కూడా గెలిపించండి……పేద ప్రజల సమస్యల పరిస్కారానికి నిరంతరం కృషి చేస్తారు అంటూ విశాఖ ఎన్నికల ప్రచారంలో భాగంగా శారదపీఠంకు వెళ్లారు. అక్కడ స్వరూపానంద స్వామీని కలిశారు. విశాఖ జీవీఎంసీ 97 వ వార్డు సీపీఐ అభ్యర్థి ఆర్ యశోధ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఐ నారాయణ అక్కడకు వెళ్లారు.
నారాయణ తొలిపూజలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.