వలస కార్మికుల కోసం రాజ్ భవన్ ముట్టడించిన సిపిఐ - Tolivelugu

వలస కార్మికుల కోసం రాజ్ భవన్ ముట్టడించిన సిపిఐ

వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జాతీయ , రాష్ట్ర కార్యదర్సులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి రాజభవన్ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున వలస కార్మికులతో రాజ్ భవన్   చేరుకొని నినాదాలు చేశారు . వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది .

సిపిఐ నారాయణ మాట్లాడుతూ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా మాటలు చెప్పడం మాని, వలస కార్మికులను ఆదుకునే విషయంలో చొరవ చూపించాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు .వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు .

Share on facebook
Share on twitter
Share on whatsapp