సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సినీ హీరో నాగార్జున పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోతో మహిళలను నాగార్జున అవమానించారని నారాయణ ఆరోపించారు. బిగ్ బాస్ పై త్వరలో హైకోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. హీరో నాగార్జున దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని…బిగ్ బాస్ లో ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి యువకుడిని ఎవరిని కిస్ చేస్తావు.. ఎవరితో డేటింగ్ చేస్తావు.. పెళ్లి ఎవరిని చేసుకుంటావు అంటూ అడిగాడని ఆ ఫోటోల్లో తన ఇంట్లోని మహిళల ఫోటోలు పెట్టి అడగరా అంటూ ప్రశ్నించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తానని ఎంతవరకైనా పోరాడుతానని నారాయణ స్పష్టం చేశారు. సినీ హీరో నాగార్జున సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో సినీ హీరో అభిజిత్ టైటిల్ ను గెలుచుకున్నాడు.