భారతదేశంలోనే నెంబర్ వన్ ఎయిర్ పోర్ట్ అయిన బాంబే ఎయిర్ పోర్ట్ ను.. జీవీకే సంస్థ అధునాతనంగా నిర్మించతలపెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఫైనాన్స్ సిటీ ముంబాయిలో ఇతరులు ఉండడానికి వీలు లేదని అదానీ సంస్థ తన పలుకుబడిని ఉపయోగించిందన్నారు.
జీవీకే సంస్థకు అప్పులు ఉన్న కారణంగా.. మీరు అప్పులు కట్టలేరని మాకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించాలని బెదిరించి జీవీకే సంస్థ నుండి కాంట్రాక్టు లాగేసుకుందని ఆరోపించారు. ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల కోసం ఎస్బీఐ గతంలో జీవీకే సంస్థకు రుణాలు మంజూరు చేయలేదన్నారు.
కానీ.. అదానీ కంపెనీకి ఎస్బీఐ 12,770 కోట్లు మాఫీ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గుజరాత్ బంద్రా నుండి పాండిచ్చేరి వరకు సముద్ర తీరం మొత్తం ఆస్తులు అదానీ కి సంస్థ ఆదీనంలోనే ఉన్నాయని పేర్కొన్నారు.
దాంతో ఎదేచ్చగా స్మగ్లింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అదానీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు నారాయణ.