-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఏపీలో 1,86,461 కరోనా పాజిటివ్ కేసులు, 1681 మరణాలు నమోదయ్యాయి.అయినా రాష్ట్రప్రభుత్వం నిద్ర పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్రమాదాన్ని విస్మరించి, వివాదాస్పద బిల్లుల అమలుకు సిద్ధం కావటం దుర్మార్గపు చర్య. రాజధాని మార్పు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో స్టే విధించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఈ వివాదాన్ని పక్కన పెట్టండి. కరోనా రోగులకు రాష్ట్రంలో సరైన వైద్యం, ఆహార సౌకర్యాలు అందటం లేదు. ఏపీలో వైద్యంపై నమ్మకం లేక సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలే పొరుగు రాష్ట్రానికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. మీ మొండి వైఖరి విడనాడి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి కరోనా కట్టడికి చర్యలు చేపట్టండి. లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.