కె. రామకృష్ణ, ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
షరతులు విధించి పెన్షన్‌లలో కోత విధించడం సరికాదు. మీరు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు పెట్టిన మొదటి సంతకం వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ల పెంపు ఫైల్‌ఫై. కానీ అది సక్రమంగా అమలు కావడం లేదు.ఇప్పుడు రేషన్ కార్డులో ఉన్న ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇస్తామని నిబంధన పెట్టారు. భర్తలేని ఒంటరి మహిళలకు వయసు తక్కువ ఉందననే సాకుతో పెన్షన్ నిలిపివేస్తున్నారు.
గతంలో వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోలేకపోయినా తదుపరి ఒకేసారి ఇచ్చేవారు. ఒకప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకోకుంటే ఆపేస్తామని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో షరతుల మెలికలు పెట్టడం సామాజిక బాధ్యతను విస్మరించడమే అవుతుంది.