రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
చంద్రబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. పోలీసుల వైఫల్యానికి ఇది నిదర్శనం. సాక్షాత్తు ప్రతిపక్ష నేతకే రక్షణ కరువయ్యే పరిస్థితులు కొనసాగటం విచారకరం. ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే పోలీస్ యంత్రాంగం ఈ ఘటన జరగకుండా ఎందుకు కట్టడి చేయలేకపోయింది..?
చంద్రబాబు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడతాయని ముందే సమాచారం ఉన్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం విచారకరం. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరు. రాజకీయ ఆరోపణలను మాటల ద్వారా ఎదుర్కోవాలేగాని భౌతిక దాడులకు దిగడం తగదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రాజకీయాల్లో హింసకు తావు ఉండకూడదు.