డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదుచేసి సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించటంపట్ల హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సుధాకర్ కేసులో విశాఖ పోలీసులపై 8 వారాల లోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. 30 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన డాక్టర్ సుధాకర్ కరోనాను ఎదుర్కొనేందుకు మాస్కులు, గ్లవుజులు లేవన్నందుకు సస్పెండ్ చేశారు.
విశాఖలో సుధాకర్ పెడరెక్కలు విరిచికట్టి పిచ్చివానిగా చిత్రీకరించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు రామకృష్ణ. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇది పరాకాష్టని హితవు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెం 623ను హైకోర్టు రద్దు చేయడాన్ని సిపిఐ స్వాగతిస్తుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా జీవో ఇవ్వడం రాష్ట్రప్రభుత్వ ఏకపక్ష విధానాలకు నిదర్శనమన్నారు రామకృష్ణ.