ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టును షేర్ చేసిందననే సాకుతో 66 సంవత్సరాల రంగనాయకమ్మ పై కేసు నమోదు చెయ్యటం అన్యాయమన్నారు. మాస్కులు, గ్లౌజులు లేవన్నందుకు నడిరోడ్డుపై డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచికట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై శాంతియుత నిరసనకు సిద్ధమైన మాపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధించారు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధిత ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే తిరుగుతున్నారేగాని ప్రతిపక్ష పార్టీలను రానివ్వడం లేదు.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పాల్పడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ పాలన సాగించాలనుకుంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు.
భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ నెల 22న ట్రేడ్ యూనియన్లు చేపట్టిన నిరసనలకు సీపీఐ పూర్తిగా మద్దతిస్తుందని రామకృష్ణ తెలిపారు.