ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. అమరావతి రైతులు ఏర్పాటు చేసిన జనభేరీ సభలో మాట్లాడుతూ ఇప్పటికైనా సీఎం జగన్ తన ఆలోచనను మార్చుకోవాలని సూచించారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించడాని, అధికారంలోకి వచ్చాక మాట మార్చాడని ఆరోపించారు. పాదయాత్రలోనూ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, వైసీపీ మేనిఫెస్టోలో కూడా పెట్టకుండా రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు.
దేశంలో ఏ అసెంబ్లీలోనైనా ఇంత అధ్వానంగా చట్టాలు జరిగాయా… పైగా అమరావతి ఉద్యమానికి పోటీగా ధర్నాలు చేస్తారా? అని మండిపడ్డారు. సీఎం జగన్ ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా చేసిన తప్పును సరిదిద్దుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమ నాయకులను కూడా అమరావతి ఉద్యమంలో భాగం చేస్తామన్నారు.