మూడు రాజధానులు పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాజధానుల విషయంలో కేంద్రం సహకారంతోనే గవర్నర్ సంతకం పెట్టారని రామకృష్ణ తెలిపారు. దేశంలో నరేంద్ర మోడీ కనుసైగ లో గవర్నర్ వ్యవస్థ పని చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిజెపి విభిన్న స్వరాలతో కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అన్యాయం చేసింది జగనేనని అన్నారు. సేవ్ అమరావతి పేరుతో ఆల్ పార్టీ నాయకులతో చర్చించి అమరావతి రాజధానిపై ఉద్యమానికి సిద్ధం అవుతున్నామని తొలివెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిపిఐ రామకృష్ణ మాట్లాడారు. రాజధాని విషయమై రామకృష్ణ ఇంకేమన్నారో ఇంటర్వ్యూ లో చూద్దాం.