ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మరో లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడిన జర్నలిస్టులకు రు.20 వేలు.., హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి రు.10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని రామకృష్ణ లేఖలో గుర్తు చేశారు. ఏపీలో ఇప్పటికే పలువురు జర్నలిస్టులకు కరోనా సోకగా, 27 మంది మరణించారని అన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వానికి వివక్ష తగదని.. తెలంగాణ తరహాలోనే ఏపీలోని జర్నలిస్టులను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.