రాష్ట్రంలో కరోనా వైరస్ విపత్తు దృష్ట్యా మూడు సబ్జెక్టులు పెండింగ్ లో ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 17వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆయన సీఎంకు రాసిన లేఖలో ప్రస్తావించారు.

ఏపీలో విద్యార్థుల్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 సబ్జెక్టులు పెండింగ్ లో ఉన్న విద్యార్థులను ఉత్తీర్ణులుగా అక్కడి ప్రభుత్వం పరిగణించిందని, డిప్లమో సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించిందని రామకృష్ణ అన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ విద్యార్థులకు డిప్లమో సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరారు.