కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
డిస్కంల నిర్వహణ, సబ్సిడీలు, ఈ ఆర్ సి వంటివి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయి, రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే రైతులకిచ్చే ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడం తప్పనిసరి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రాక్షస బిల్లుగా పరిగణించి, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.కానీ ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ అంటున్నది. కేవలం రుణ పరిమితి పెంచుకొని, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి కోసం కేంద్ర నిర్ణయాలకు సై అనటం సరికాదని అన్నారు.