రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ ఎత్తివేసి, ఇప్పటికైనా ఈ వివాదానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. కరోనాను ఎదుర్కునేందుకు సరైన వైద్య పరికరాలు లేవన్న చిన్నమాటకి డాక్టర్ సుధాకర్ ని సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.నిరసన తెలిపినందుకు అతని పెడరెక్కలు విరిచి కట్టి, కొట్టి నడిరోడ్డుపై అవమానించారని మండిపడ్డారు.
ఈ ఘటనపై దళిత సంఘాలన్నీ భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాయి.రాజకీయ పార్టీలుగా మేము చూస్తూ ఉండలేం. దళిత సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోగ్య శాఖా మంత్రికి లేఖ రాశారు .