హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆరెఎస్ పార్టీకి మద్దతిచ్చి, ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న సిపిఐ… అధికార టీఆర్ఎస్‌కు డెడ్‌లైన్ విధించింది. తాము కార్మికుల పక్షాన పోరాడుతామని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ విషయాలలో ప్రభుత్వ ధోరణి సరిగా లేదని మండిపడుతోంది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకుంటే… హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ మద్దతు ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం తన విధానంపై పునరాలోచించి, కార్మికుల డిమాండ్లను నేరవేర్చని పక్షంలో తమదారి తమదేనని హెచ్చరించింది.
దీనిపై… అధికార టీఆర్ఎస్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.