దశాబ్దాలుగా జర్నలిస్ట్ లకు సొంత ఇంటి కల కలగానే మిగిలిందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇదే విషయమై ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. సామాజిక సమస్య పట్ల ఎంతో అవగాహన కలిగి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా జర్నలిస్టులు విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా వీరికి సొంత ఇల్లు సమకూరటం కలగానే మిగిలింది. కరోనా ఉపద్రవం నేపథ్యంలో జర్నలిస్టులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
పలువురు జర్నలిస్టులు ఇప్పటికే తీసుకున్న హౌసింగ్ రుణాలు చెల్లించలేక పోతున్నారు.రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పత్రిక, మీడియా సంస్థల్లో పనిచేసే వారికి తక్షణం ఇళ్లస్థలం లేదా ఇల్లు మంజూరు చేయగలరు.ఇప్పటికే హౌసింగ్ లోన్ తీసుకున్న జర్నలిస్టులకు రు.10 లక్షలు సబ్సిడీ కింద మంజూరు చేయవలసిందిగా కోరుతున్నామని లేఖ లో పేర్కొన్నారు.