రానున్న అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని ప్రకటించారు. అలాగే తాము ఎవరినీ బతిమలాడమని, తమతో అవసరముంటే వాళ్లే తమ దగ్గరకు వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో తమకు బలం ఉందని, ఫలితాలను తారుమారు చేసే సత్తా వామపక్షాలకు ఉందని వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలోకి రావాలో కూడా తామే నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
గతంలో 2018 ఎన్నికల్లో సాలెగూడులో ఇరుక్కున్నామని అన్నారు. అతి త్వరలోనే సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తో కలిపిపోయిన వామపక్షాలు.. ఇప్పుడు అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎర్రజెండా నేతలు ఒక్కటై ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించడం ఆసక్తిగా మారింది. మరి దీనిపై బీఆర్ఎస్ అధినాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.