ముందుగా ఊహించినట్లుగానే… అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన సీపీఐ, తన మద్దతు ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె, కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తోన్న అణిచివేత ధోరణిపై సీపీఐ గుర్రుగా ఉంది. వెంటనే రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరిచి, అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.