సంచలన వ్యాఖ్యలు చేసే నారాయణ మరోసారి ముంపునకు గురైన గ్రామాల పై మట్లాడారు. ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపాల్సిందేనని ప్రకటించారు . 5 గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు అభ్యంతరం లేదని చంద్ర బాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నప్పుడే రెండు రాష్ట్రాలు రాజకీయాలు పక్కన పెట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
వరదల్లో మునిగిన ప్రాంతాలు కాపాడుకోవడం విస్మరించి రెండు రాష్ట్రాల మంత్రులు ఉద్దేశ్య పూర్వకంగానే విషయాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణలోకి ఐదు గ్రామాలను కలిపే అంశం పై CPI పార్టీ మద్దతు తెలుపుతుందని చెప్పారు.
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మోడీకి అనుకూలంగా వ్యవరిస్తున్నాయని.. వరద ముంపు ప్రాంతాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని నారాయణ డిమాండ్ చేశారు.
కేంద్రాన్ని రెండు రాష్ట్రలు జాతీయ విపత్తుగా గుర్తించాలని అడగాలన్నారు నారాయణ. ఐదు గ్రామాలు తెలంగాణలోకి రావటానికి ఎటువంటి అభ్యతరం లేదని చంద్రబాబు తెలిపాలని కోరారు.