స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు సిపిఎం బాబురావు. బాద్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతు స్థానిక బీఆర్టీఎస్ రోడ్డులోని నండూరి ప్రసాదరావు శ్రామిక భవనం నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సి.పి.ఎం.రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్. బాబూరావు మాట్లాడుతూ కోవిడ్ సెంటర్ గా ఉన్న స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ప్రమాదంలో 10 మంది చనిపోవడం భాదాకరం అన్నారు. దీనికి కారణమైన బాధ్యులపైన, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బు వసూలు చేసే శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేకపోవడం చాలా విచారం. కానీ యాజమాన్యం ఇవన్నీ ప్రభుత్వ అనుమతులతోనే చేశామని చెప్పడంతో… జరిగిన సంఘటనకి ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు.
కరొనా రొగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ప్రాణాలను కాపాడుకుందామని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లడం జరుగు తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందడం లేదు. బెడ్లు ఉన్నా, డాక్టర్లు లేనందున ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే పూర్తి సిబ్బందితో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను కోవిడ్ ఐసొలెషన్ ఆస్పత్రిగా మార్చాలని సూచించారు. ఢిల్లీలో తాత్కాలిక ఆస్పత్రి కట్టారని, కేరళలో కరొనాను కట్టడి చేసారని గుర్తు చేశారు. కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేక పోతుంది అని ప్రస్నిచారు. సంక్షేమం అంటే 10 వేలు, 5 వేల రూపాయలు ఇవ్వటమే కాదు, ముందు ప్రాణాలను కాపాడే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఈ విషయం లో పూర్తిగా విఫలం అయిండన్నారు. కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రులు దీని అవకాశముగా తీసుకొని ఎంతవసూలు చేస్తున్నా అడిగే నాధుడు లేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అన్ని హాస్పిటల్ లో అమలు చేస్తామని జీవో రిలీజ్ చేసీనా, ఒక్క హాస్పటల్ లోనైనా అమలు చేయలేదు. రోడ్డుమీద మాస్కు పెట్టకపోతే ఫైను, హెల్మెట్ పెట్టుకోకపోయినా, లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన షాపులకు ఫైన్ వేయడం, మూసి వేయడం గాని చేస్తున్నారే… మరి విజయవాడలో ఈ రకంగా ప్రజలను దోచుకుంటే రాష్ట్ర ప్రభుత్వంకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రైవేటు వైద్యం వద్దు అనడం లేదు, కానీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు వసూలు చేయాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్లకి ఆరోగ్యశ్రీ ప్రకారం వైద్యం చేయాలన్నారు. మందులు కూడా ఇస్తామని జీవో రిలీజ్ చెసినా ఉచిత వైద్యం, మందుల పంపిణీ ఎక్కడా అమలు జరగడం లేడన్న విషయం మంత్రులకు తెలియదా ప్రస్నిచారు. మోడీ గారు రామాలయ నిర్మాణ పనులు , రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చే పనుల్లో, మన రాష్ట్ర ప్రభుత్వము రాజధాని మార్చే పనిలో ఉండి, ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదని విమర్శించారి.
కరొనా కాదు మాములు జ్వరం వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
జ్వరం వస్తే కరోనా టెస్ట్ లేనిదే చూడడం లేదని, కరోనా టెస్ట్ చేయిస్తే వారానికో పది రోజులకు వస్తుంది. ఈ లోగా ఏమి చేయాలో తెలియక ప్రజలు అయోమయ స్తితిలొ వున్నారు. మరొ ప్రక్క కరొనా వస్తే మీరు ఇంట్లోనే ఉండమని చెబుతున్నారు గాని ప్రభుత్వానికి పట్టడం లేదు. హోటళ్లను మార్చేసే అనుమతులు ఎవరు ఇచ్చారు.ప్రభుత్వమే ఇచ్చిందని యాజమాన్యం పబ్లిక్గా చెబుతుంది. కాబట్టే ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రిలో వైద్యం జరిగేంత వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, వైద్యం పెంచేతవరకూ ప్రజలకు మద్దతుగా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి విష్ణువర్ధన్, శ్రీదేవి, బి రమణ రావు, కే దుర్గారావు, టీ ప్రవీణ్,కృష్ణమూర్తి, నటరాజ,మాల్యాద్రి, శ్రీను,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.