తెలంగాణ లో ప్రణాళిక బద్ద వ్యవసాయం చేయాలని కెసిఆర్ ప్రభుత్వం భావిస్తోంది. కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి అధికారులు, వ్యవసాయ నిపుణులతో జరిగిన చర్చలో చెప్పిన పంటలు వేసిన వారికే రైతు బంధు పథకం వర్తింపచేయాలని చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి . ఇదే అంశంపై తొలివెలుగుతో సిపిఎం నేత , వ్యవసాయ నిపుణులు మల్లారెడ్డి మాట్లాడారు . ప్రణాళిక బద్ద వ్యవసాయం మంచి నిర్ణయమే కానీ, దానికి తీసుకోవాల్సిన చర్యల సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . భూసార పరీక్షలు చేయకుండా , నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో లేకుండా సాధ్యమయ్యే పని కాదన్నారు .
అంతేకాదు , అసలు కౌలు రైతులను విస్మరించిన కెసిఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలని ఎవరిని ఆదేశిస్తుందని ప్రశ్నించారు ఇదంతా రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసే పనిలో భాగమన్నారు .ఇంకా తెలంగాణ వ్యవసాయం పై మల్లారెడ్డి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు . కింది వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం ……