కరోనా మహమ్మారి మరో నేతను బలి తీసుకుంది. సీపీఎం సీనియర్ నేత, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వైరస్‌తో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు.. నిన్న ఆయన కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించారు.. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఆయన్ను చికిత్స కోసం భద్రాచలం నుంచి విజయవాడ హాస్పిటలకు తరలించారు. అక్కడే ఆయన మృతి చెందారు.
భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు సీపీఎం తరపున రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యే అయినప్పటికీ నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ వచ్చి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవారు. సున్నం రాజయ్య మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.