లాక్ డౌన్ తో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు విధ్యుత్ చార్జీలు పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు . జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ చట్ట సవరణను కూడా రాష్ట్రం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న నేతలను హౌస్ అరెస్టు చేయడం దారుణమని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం సిపిఎం నేతలు ఆందోళన చేస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు.