మొన్నటి ఎన్నికల్లో చెట్టా పట్టలేసుకొని తిరిగిన జనసేన , సీపీఎం మధ్య దూరం పెరుగుతోంది. అమిత్ షాలాంటి వాళ్లే దేశానికి కావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించడం రాజకీయ అవకాశవాదం అని సీపీఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి మధు మండిపడ్డారు.పోయె కాలం దగ్గర పడితే ఇలాగే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మతోన్మాద పార్టీని, హోం మంత్రిని మెచ్చుకోవడం దారుణమన్నారు.తన వైఖరిని ఆయన పునరాలోచించుకోవాలని సూచించారు.