హుజూర్‌నగర్‌లో మరో రెండు పార్టీల మధ్య పొత్తుపొడిచే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే సిపిఐ చేయి విడిచి కారెక్కగా, స్థానికంగా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక మరో కమ్యూనిస్ట్ పార్టీ సీపీఎం అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ, నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో సిపిఎం మద్దతు కోరుతుంది టీడీపీ. ఇప్పటికే టీజెఎస్ కాంగ్రెస్ మద్దతు పలకగా… సిపిఎం టీడీపీకి మద్దతిస్తే… రెండు పార్టీలు ఓ జంటగా, రెండు పార్టీలు మరో జంటగా అన్నట్లు తయారవుతుంది.