వయసుతో సంబంధం లేకుండా అందర్ని వెంటాడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె పోటు. అప్పటి వరకు ఆరోగ్యంగానే కనిపిస్తున్న వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. దీంతో చిన్న,మధ్య వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మృత్యువాత పడుతున్న ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
అయితే ఇటీవల హైదరాబాద్ లో ఇదే విధంగా రోడ్డుపై గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తిని అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సీపీఆర్ చేశాడు. ఇది చేయడంతో అతని ప్రాణాలు కాపాడాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా నగర పోలీసులకు ఉన్నతాధికారులు సీపీఆర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. గోషా మహల్ లో పోలీస్ కానిస్టేబుల్స్ కు సీపీఆర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ప్రారంభించారు.
అత్యవసర సమయాల్లో ప్రాణాలను నిలబెట్టే సీపీఆర్ పై పోలీసు అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.