ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది ఓ పీత ఫొటో. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ఈ పీత అన్ని పీతల్లా లేదు.ఎందుకంటే అన్ని పీతల్లా కాకుండా దీనికి పళ్లున్నాయి. కానీ అవి కూడా మనుషులకు ఉన్నట్లు…
ఈ ఫొటో చూసిన నెటిజన్లు అందరూ కూడా బాబోయి ఈ పీతేంటి ఇలా ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పీతను చూడలేదని అంటున్నారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ భూమి పై ఎన్నో వింతలు గురించి మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి.
ముఖ్యంగా సముద్రం గురించి తెలుసుకోవాలంటే అదో పెద్ద రహస్యం అనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ జంతు ప్రేమికుడు తీసిన పీత ఫొటో నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటుంది. సముద్ర గర్భంలో నివసిస్తున్న పీతను ఫొటో తీసి ఇన్‌స్టాలో షేర్ చేశారు.
ఆ పీత ప్రత్యేకత ఏంటంటే..మనుషుల మాదిరిగానే దీనికి కూడా నోటి నిండా పళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పళ్లతో ఉన్న పీత చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయిన జనాలు దాన్ని ఇతరులతో కూడా పంచుకుంటూ ఫన్నీ కామెంట్లు చేసుకుంటున్నారు.
ఇంతకు ముందు ఒకసారి మత్స్యకారుల వలలో చిక్కిన చేప నోటిలో మనుషుల్లానే పళ్లు ఉన్నాయని.. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.