విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు వరకు మృతి చెందినట్టు సమాచారం. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా పక్కకు కూలటంతో ఈ ప్రమాదం జరిగింది.ఇప్పటికే మూడు మృత దేహాలను గుర్తించగా మరి కొంత మంది క్రేన్ కింద చిక్కుకున్నారని అని తెలుస్తుంది. ముందు రెండు మృతదేహాలు బయటకు వచ్చాయి.
ఈ ప్రమాద ఘటనకు కారణం ఏంటీ అనేది స్పష్టత లేదు. ఘటన పై ఇంకా యాజమాన్యం స్పందించలేదు. ఘటన జరిగిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు అని తెలుస్తుంది. ఈ ఘటనలో పది మంది వరకు పైగా గాయపడ్డారు అని తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.