అంత్యక్రియలనేవి మతాల సెంటిమెంట్లు అడ్డుగోడలు కాబోవని హైకోర్టు దర్మాసనం తేల్చి చెప్పింది. సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ ఫౌండర్ డా.రాజశేఖర్ రావు కేసులో హైకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.
2004 నుండి నిరాశ్రయులను, అనాథలను చేరదీస్తూ… ఆశ్రయం కల్పిస్తోంది సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్. అయితే.. మార్చి 28న సర్ధార్ బీ అనే మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యింది. కానీ ఆమెకు నా అనేవారు ఎవరూ లేకపోవటంతో… ఫౌండేషన్ సభ్యులు వెల్ఫేర్ సెంటర్‌కు తరలించారు. కానీ ఆమె అనారోగ్యం కారణంగా మరణించటంతో… దగ్గరలోని పురానాపుల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
కానీ ఓ ముస్లింకు హిందు స్మశానవాటికలో ఎలా దహన సంస్కారాలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ… మహ్మద్ అలీ అనే వ్యక్తి అప్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఫౌండేషన్ చీఫ్ రాజేశ్వర్‌రావుకు జైలు శిక్ష పడ్డప్పటికీ ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
దీనిపై ఇరు పక్షాలు హైకోర్టును ఆశ్రయించటంతో… రెండు సంవత్సరాల విచారణ తర్వాత ఆ కేసును కొట్టివేస్తూ… అంత్యక్రియలకు మతాలు అడ్డుకాబోవని స్పష్టం చేసింది.