సినీ తారల క్రికెట్ పోటీలకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది క్రిసెంట్ క్రికెట్ కప్‌లో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ జట్లు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది కూడా క్రిసెంట్ క్రికెట్ కప్‌లో తలపడేందుకు స్టార్స్ జట్లు రెడీ అయ్యాయి. ‘క్రెసెంట్ క్రికెట్ కప్’(సీసీసీ)ని వచ్చే నెల 26న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
బంజారాహిల్స్ లోని హోటల్‌లో ‘క్రెసెంట్ క్రికెట్ కప్’బ్రోచర్స్‌ను హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, పోటీల నిర్వాహకులు షకీల్ సఫీ మాట్లాడారు.
మ్యాచ్ పూర్తిగా ఉచితమని వారు పేర్కొన్నారు. మ్యాచ్ చూసేందుకు ఆసక్తి ఉన్న వారు సీసీసీ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుని పాస్‌లను పొందాలని సూచించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని వారు పేర్కొన్నారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. క్రికెట్‌పై ఎంతో ఆసక్తి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీసీసీ టీమ్ సభ్యులను మంత్రి అభినందించారు. టీమ్ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే బాలరాజు, అర్బాజ్ ఖాన్, హోంమంత్రి విన్నర్, రన్నర్ కప్‌లను లాంచ్ చేశారు.