చిన్న గొడవలు చినికి చినికి గాలివానల అక్కడ మారుతుంటాయి. రోడ్డు పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవకే గాల్లో తూటాలు పేలుతుంటాయి. మాట మాట పెరిగితే చాలు తల్వార్లు స్వైర విహారం చేస్తాయి. కిడ్నాప్ లు,మర్డర్లు సర్వసాధారణం అక్కడ. ఇక ఒకప్పుడు ఆ ప్రాంతం మతఘర్షణలతో అట్టుడికి పోయేది. మొత్తానికి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం ఎప్పుడూ ఆ ప్రాంతంలో ఉంటుంది.
అదే మన పాతబస్తీ. క్రైం కి అడ్డాగా మారిన ఓల్డ్ సిటీలో తాజాగా క్రికెట్ చిచ్చు రేపింది. సరదాగా గల్లీలో క్రికెటె ఆడుతూ బ్యాట్ మెన్ కొట్టి సిక్సర్ గ్యాంగ్ వార్ కు దారి తీసింది. ఈ ఘటన నిన్న సాయంత్రం చంద్రాయణ గుట్టలో చోటుచేసుకుంది. ఇక డీటైల్స్ లోకి వెళితే.. క్రికెట్ ఆడుతూ ఓ మహిళ ఇంట్లోకి బాల్ వెళ్లింది. దీంతో రెచ్చిపోయిన ఆ మహిళ క్రికెట్ ఆడడానికి వేళాపాళా అక్కర్లేదా .. అంటూ పూతు పురాణం అందుకుంది.
తరువాత క్రికెట్ ఆడిన కుర్రాళ్ల వైపు నుంచి కూడా కొందరు వచ్చి ఆ మహిళతో గొడవకు దిగారు. దీంతో రెండు గ్యాంగులుగా స్థానికులు విడిపోయారు. మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది. ఇక ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. ఓ వర్గం ఆ మహిళ ఇంటిపై దాడి దిగింది. కిటికీ అద్దాలు పగుల కొట్టారు. ఈ దాడిలో మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
ఇక స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను కూడా అక్కడి నుంచి చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.