హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ఆరోపణలు చేశారు. హెచ్.సి.ఏలో అవినీతి జరుగుతోందంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.
హలో కేటీఆర్ సర్, హెచ్‌సీఏలో అవినీతి ఎక్కువగా ఉంది. దానిని తొలగించడానికి మీ సహాయం కోరుతున్నాను. క్రికెట్ జట్టుని డబ్బుతో కొందరు అవినీతి పరులు ప్రభావితం చేయాలని చూస్తున్నారని, వారందరిపై ఏసీబీ కేసులు కూడా ఉన్నయాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు దూరమైనప్పుడే హైదరాబాద్ గొప్పగా తయారవుతుందని ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇటీవలే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ టీం అద్భుత విజయం సాధించింది. సో… అవినీతిలో కూరుకపోయిన వారు ఎవరై ఉంటారు… అంబటి ట్వీట్‌కు కేటీఆర్ ఎలా స్పందిస్తారు అంటూ చర్చలు మొదలైపోయాయి.