బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ పలు వివాదాల నడుమ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే పఠాన్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడా..? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారణం మళ్లీ వార్నర్ ఫామ్ లోకి వచ్చాడు.. వీడియోలు చేయడంలో అన్నమాట.
తరచూ ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో వార్నర్ హంగామా చేస్తుంటాడు. అప్పుడప్పుడు తెలుగు డైలాగ్స్ కూడా చెబుతుంటాడు. తాజాగా పఠాన్ లోని ఓ పాటకు షారుఖ్ ముఖానికి తన ముఖం మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు డేవిడ్.
దీంతో పాటు ‘వావ్ వాట్ ఏ ఫిల్మ్.. మీరు దీనికి పేరు పెట్టగలరా?’ అనే క్యాప్షన్ ను కూడా జోడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇప్పుడు డేవిడ్.. పఠాన్ అవతారమెత్తాడని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
డేవిడ్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఫేస్ మాస్క్ యాప్ ద్వారా హీరోల ముఖాలను రిప్లేసి తన ముఖం కనిపించేలా చేసి వైరల్ గా మారాడు. కొత్తగా పఠాన్ లుక్ చూసి.. డేవిడ్ వార్నర్ కు ఆస్కార్ గ్యారంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram