జామియా యూనివర్సిటీ అల్లర్లపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్ లో స్పందించారు. ” రాజకీయ పార్టీలు ఒకరినొకరు నిందించుకోవడం ఎప్పుడూ జరిగేవే..కానీ నేను, నా దేశం జామియా మిలియా స్టూడెంట్స్ గురించి ఆవేదన చెందుతున్నాము” అని ట్వీట్ చేశారు.
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. విద్యార్ధులు పలు బస్సుల దహనం చేవారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు చేసిన లాఠీచార్జీలో పలువురు విద్యార్ధులు గాయపడ్డారు. ఈ సంఘటన అనంతరం నిరసనలు దేశంలోని మిగతా యూనివర్సిటీలకు పాకాయి. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలోనూ విద్యార్ధులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి పలువురు విద్యార్ధులు గాయపడ్డారు.