ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు సిడ్నీలో జరుగుతుంది. రెండో టెస్టు ద్వారా అరంగ్రేటం చేసిన మహ్మాద్ సిరాజ్ మూడో టెస్టులోనూ ఆడుతున్నారు. అయితే, గురువారం మ్యాచ్ కు ముందు సిరాజ్ కన్నీటి పర్యంతం అయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తుండగా… సిరాజ్ కంట తడిపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సిరాజ్ తండ్రి అనారోగ్యంతో హైదరాబాద్ లో ఇటీవలే కన్నుముశాడు. అయితే, క్వారెంటైన్ నిబంధనల కారణంగా సిరాజ్ భారత్ కు రాలేక అక్కడే ఉండిపోయాడు. జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టుకు ముందు పేసర్ షమీ గాయపడటంతో సిరాజ్ తన తొలిటెస్టు మ్యాచ్ ఆడాడు. గురువారం మూడో మ్యాచ్ మొదలయ్యే ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో తన తండ్రిని గుర్తు చేసుకొని సిరాజ్ భావోధ్వేగంతో కంటతడి పెట్టాడు.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పెవిలియన్ కు పంపి… ఆదిలోనే ఆసీస్ కు సిరాజ్ షాకిచ్చాడు.
✊ #AUSvIND pic.twitter.com/4NK95mVYLN
— cricket.com.au (@cricketcomau) January 6, 2021