క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ కి తిరిగి వెళ్తుండగా రూర్కీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ ని ఢీ కొంది. ఈ యాక్సిడెంట్ లో ఆయన నుదుటికి, కాలికి గాయాలయ్యాయని రూర్కీ సమీపంలోని హమద్ పూర్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందన్నారు. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఢిల్లీ లోని హాస్పిటల్ కి రెఫర్ చేస్తామని వారు చెప్పారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ వాహనం డివైడర్ ని ఢీ కొనగానే మంటలు అంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది.
తక్షణమే ఢిల్లీ రోడ్ లోని సాక్షం ఆసుపత్రికి రిషబ్ ని తరలించినట్టు తెలిసింది. తన బీఎండబ్ల్యు కారును రిషబ్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్టు ప్రాథమిక సమాచారం బట్టి తెలిసింది.