‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టి ‘గీత గోవిందం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్ రష్మికా మందాన. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు కన్నడ భామ. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా రష్మిక నటనకి దేశవ్యాప్తంగా ఆదరణ దక్కింది. దీంతో నేషనల్ క్రష్ అయ్యారు. అయితే తాజాగా రష్మిక గురించి భారత క్రికెటర్ శుభమన్ గిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు రష్మిక ఎవరో తనకు తెలియదంటూ ఇన్‌స్టా వేదికగా గిల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన రష్మికా మందాన.. తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్న సెలబ్రిటీలు సైతం రష్మికకు అభిమానులుగా మారిపోయారు. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తన తాజా క్రష్ రష్మికా మందాన అని ఒక టాక్ షోలో చెప్పారు.
తన క్రష్ రష్మికా మందాన అని గతంలో ప్రకటించారు ప్రముఖ క్రికెటర్ శుభ్‌మన్ గిల్. ప్రస్తుతం ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దానిపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు గిల్. ‘రష్మిక నా క్రష్ అని అసలు ఏ మీడియాతో చెప్పాను? నేను ఎవరితోనూ చెప్పినట్టు గుర్తులేదు. తను ఎవరో కూడా నాకు తెలీదు’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కామెంట్స్ చేశాడు.
అయితే, రష్మిక ఎవరో తనకు తెలియదని గిల్ చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక తెలియకపోవడం ఏంటి? అయినా నీకు రష్మిక ఎందుకు తెలుస్తుంది. నీకు సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్ వంటి వారు నీ క్రష్ అయినప్పుడు రష్మిక ఎందుకు అవుతుందిలే’ అంటూ కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వరుసగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న రష్మిక, వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. అతిగా ట్రోల్ చేసే వారికి మాత్రం అప్పుడప్పుడూ హెచ్చరికలు చేస్తుంటారు రష్మిక. మరి గిల్ చేసిన కామెంట్లపై ఎలా స్పందిస్తారో?