టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఎట్టకేలకు తన క్రికెట్ కెరీర్ను ముగించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారానికి సంబంధించి కీలక ప్రకటన చేశాడు. స్పాట్ ఫిక్సింగ్ లో ప్రమేయం ఉన్న నేపథ్యంలో 2013లో శ్రీశాంత్ అలాగే మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శ్రీశాంత్ తాజాగా సంచలన ప్రకటన చేయడం భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేవలం పది లక్షల రూపాయల కోసం తాను అలాంటి పని ఎందుకు చేస్తాను అంటూ శ్రీశాంత్ మీడియా ముందు వ్యాఖ్యానించాడు. తాను ఇరానీ ట్రోఫీ ఆడే నన్ను అలాగే దక్షిణాఫ్రికా సిరీస్ ఆడాలని కూడా చూశాను అని.. 2013 సెప్టెంబర్ లో దక్షిణాఫ్రికా సిరీస్ ఆడాలని తాను చాలా పట్టుదలగా ఉన్నానని అలాంటిది 10 లక్షల కోసం తాను కెరీర్ను ఎందుకు నాశనం చేసుకుంటాను అంటూ శ్రీశాంత్ ప్రశ్నించాడు.
తన కుటుంబానికి అలాగే తన అభిమానులకు గడ్డు పరిస్థితి నుంచి బయటకు రావడానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. తాను చాలా మందికి సహాయం చేశాను అని వాళ్ళు అందరూ కూడా తనకు అండగా నిలిచారని ఆ ప్రార్థనలు వల్లే తాను బయటపడ్డానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. తన కాలికి 12 గాయాలకు పైగా అయిన తర్వాత 130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేశానని చెప్పాడు. విచారణలో ఒక ఓవర్లో 14 పరుగులు ఇవ్వాల్సి ఉందని దానికి తాను ఫిక్సింగ్ చేశానని అన్నారు అని కానీ ఆ ఓవర్లో తాను నాలుగు బంతులకు కు ఐదు పరుగులు ఇచ్చానని వైడ్ బాల్స్ గాని నో బాల్ గాని వేయలేదని అన్నాడు.