టీం ఇండియా మాజీ ఆటగాడు, క్రికెటర్ సురేశ్ రైనాను పోలీసులు అరెస్టు చేశారు. రైనాతో పాటు సింగర్ గురు రంధ్వానాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై దాడి చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు మరో 34 మందిని అరెస్టు చేశారు.
క్లబ్ నిర్వాహకులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దాడి చేశారు. నిర్ధారిత సమయం కన్నా ఎక్కువ సేపు తెరిచి ఉంచారని, కరోనా నిబంధనలను పాటించకపోవటంతోనే అరెస్టులు చేశామని సహర్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రకటించారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.
అయితే, అరెస్ట్ అయిన కాసేపటికే రైనా, గురు రంధ్వానాలు బెయిల్ పై విడుదలయ్యారు.