యశస్వి జైస్వాల్… ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అండర్ -19 (ICC U-19)లోకి దూసుకొచ్చిన చిచ్చరపిడుగు. పాకిస్థాన్ పై జరిగిన సెమీ ఫైనల్స్ లో సెంచరీ చేసి ఆ టోర్నమెంట్ లో అందరి కంటే ఎక్కువగా 312 రన్స్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్శించారు. 113 బాల్స్ లో 105 రన్స్ చేయగా..వాటిలో 8 ఫోర్లు, 4 సిక్స్ లున్నాయి. దివ్యాంశ్ సక్సేనా తో కలిపి ఓపెనర్లుగా రంగంలోకి దిగిన జైశ్వాల్ జోడీ 176 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ పై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురిశాయి. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ లాంటి వ్యక్తి జైశ్వాల్ ఆటతీరుపై విస్మయం వ్యక్తం చేశారు. ”నా మాటలు గుర్తుంచుకోండి…జైస్వాల్ పెద్ద ఆటగాడవుతాడు. అతనికి శక్తి వుంది..ఆటపై ఆసక్తి ఉంది…అతను సీనియర్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది తప్పకుండా జరుగుతుంది” అని షోయబ్ అక్తర్ ఓ యు ట్యూబ్ చానల్ లో జోస్యం చెప్పారు. ”పాకిస్థాన్ ప్లేయర్లు జైస్వాల్ చరిత్రను చూసి నేర్చుకోవాలి…అతను అద్భుతాల వెంట పరిగెడుతున్నాడు…డబ్బులు అతని వెంట పరిగెడుతున్నాయి” అని ప్రశంసించారు.
ఉత్తరప్రదేశ్ లో జన్మించిన యశ్వస్వి జైస్వాల్ గురించి క్రికెటర్ లో విజేత గానే ఇప్పటి వరకు తెలుసు. కానీ అతను పేదరికాన్ని జయించిన విజేత కూడా అనే విషయం చాలా మందికి తెలియదు. క్రికెట్ ఆడటం అంటే జైస్వాల్ కు పిచ్చి ప్రేమ. అది తనకు అమితానందాన్ని ఇస్తుందంటారు జైస్వాల్. ఆ పిచ్చి ప్రేమను…ఆ ఆనందం పొందడం కోసం ముంబై నగరంలో మార్నింగ్ క్రికెట్ ఆటలో సెంచరీలు చేస్తూ పొట్ట కూటి కోసం సాయంత్రం రోడ్డుపై పానీపూరి అమ్మేవాడు. పేదరికం అతని కోరికను అడ్డుకోలేకపోయింది. ఆ రోజుల్లో సచిన్ ఆడిన బ్యాట్ ను నేను అలాగే చూస్తుండి పోయేవాడినని చెప్పారు.ముంబైలోనే ఉండి..ముంబై తరపున ప్రాతినిధ్యం వహించాలనుకున్నట్టు జైస్వాల్ తెలిపాడు.
”నేను మా నాన్న తో కలిసి ముంబై వచ్చినప్పుడు ఆజాద్ మైదాన్ కు వెళ్తుండేవాడిని… అక్కడే క్రికెట్ ఆడటం తనకు ఇష్టం…అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ చేశాను…కొన్నేళ్ల తర్వాత ఇక మనం ఉత్తర ప్రదేశ్ తిరిగి వెళ్లిపోదామని మా నాన్న చెప్పాడు…కానీ నేను ఇక్కడే ఉండి ముంబై తరపున క్రికెట్ ఆడతానని చెప్పాను” అంటాడు జైస్వాల్.
”ఆ రోజుల్లో క్రికెట్ ఆడితే తక్కువ డబ్బులు వచ్చేవి…కుటుంబ సభ్యుల మద్దతు కూడా లేదు…సాయంత్రం పానీ పూరి అమ్మి డబ్బులు సంపాదించుకోవాలి. నాతో ఆడే తోటి క్రికెటర్లు సాయంత్రం నేను పానీపూరి అమ్మే దగ్గరకు వస్తే నాకు చాలా సిగ్గనిపించేది. అవమానంగా భావించేవాడిని…మార్నింగ్ సెంచరీ చేసే వాడిని…ఈవినింగ్ పానీపూరి అమ్మేవాడిని…అది చిన్న పనా…పెద్ద పనా..అని నేను పట్టించుకోకపోయేది. ఎందుకంటే పొట్ట కూటి కోసం పని చేయడం నాకు ముఖ్యం” అని చెప్పాడు జైస్వాల్.
”పుడ్ కొనుక్కోవడానికి, ఉండడానికి నాకు ఇళ్లు లేదు..కోచ్ జ్వాలా సింగ్ సార్ నీవు ఆటపై దృష్టి పెట్టు మిగతావి నేను చూసుకుంటానని చెప్పారు..2019 విజయ్ హజారే ట్రోఫికి నేను సెలెక్ట్ అయ్యాను..ఆ ట్రోఫీలో అత్యంత పిన్న వయస్కుడిగా రెండు వందల స్కోర్ చేసి రికార్డ్ సృష్టించాను….అక్కడి నుంచి వెనక్కి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాను” అన్నాడు యశస్వి జైస్వాల్.